శృంగార సంకీర్తన
రేకు: 1639-4
సంపుటము: 26-231
రేకు: 1639-4
సంపుటము: 26-231
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
పలుమారు మాకె(కు?) మాకె బాఁతిపడే మింతేకాక తలఁకేవే కోరికలు దక్కివున్న విపుడు | ॥పల్లవి॥ |
శిరసుపై సేసెవెట్టి చేత విడెమిచ్చి చెలిఁ దెలవేసి రతికిని దిద్దకొంటివి తొరలించి యెవ్వరు పొందులు నీతో జేయకున్నా సిరులతో వెఱచేవా చెతఁజిక్కెవేడక | ॥పలు॥ |
పక్కఁబెట్టు కాపెతోడ పచ్చిమాటలెల్లా నాడి చెక్కునొక్కి కైవశము సేసుకొంటివి తక్కించి యెవ్వతె నీకుఁ దరితీపు సేసినాను కక్కదలేవా కు కడుఁ దనివొందెను | ॥పలు॥ |
మంచముపై నిడుకొని మనసు రంజిల్లఁ జేసి పెంచి యలమేలుమంగఁ బెండ్లాడితివి యెంచి నన్నుఁ గూడితివి యిప్పుడే శ్రీ వేంకటేశ పొంచేవా నీవలపులు కొల్లలాయ నెదుట | ॥పలు॥ |