శృంగార సంకీర్తన
రేకు: 1639-6
సంపుటము: 26-233
రేకు: 1639-6
సంపుటము: 26-233
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
ఇటమీఁద నీవు మరి యేమిసేసేవు చిటుకన నేమే అక్కచెల్లెండ్ల మైతిమి | ॥పల్లవి॥ |
తతిగొని చెప్పేవు తగవులు నీకు నీవే యితవరివలెనే యీకెకు నాకు మతకారివాఁడవు నీ మర్మము నేనెఱుఁగుదు సతుల మిద్దరమును సంతమైతి మిపుడు | ॥ఇట॥ |
నెట్టుకొని సాకిరై నిలిచేవు నీవే వచ్చి చుట్టము వలెనే వుండి సారిది మాకు గుట్టువాయవాఁడవు నీ కతలు నే నెఱుఁగుదు గుట్టున బాసలు సేనుకొంటిమి నే నిపుడు | ॥ఇట॥ |
యీవేళ పొందులు విడే లిచ్చేవు చేత నీవే భావ మరఁటివలెనే పైపై నీవు శ్రీవేంకటేశ్వరుని చత్తము నేనెఱుఁగుదును యీవర సవతులమై యీడేరితిమిపుడు | ॥ఇట॥ |