శృంగార సంకీర్తన
రేకు: 1682-2
సంపుటము: 26-487
రేకు: 1682-2
సంపుటము: 26-487
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
కూడుదు రారా ఇఁకఁ గొరతలేల వేడుకలు దైవారీ విడెమైనా నియ్యరా | ॥పల్లవి॥ |
కద్దురా నీసుద్దులు కడఁగడల వింటిమి వద్దురా యింతేల మమ్ము వలఁబెట్టేవు ఇద్దరము వేగినంతా యిటువలె నుండఁగాను నిద్దుర కన్నులఁ దేరీ నీవు నన్నుఁ జూడరా | ॥కూడు॥ |
మేలురా నీగుణములు మిక్కిలిజాణ నౌదువు యేలరా నావద్దనుండే యెంతసేసేవు కేలు రాజసాన నీవు గిలిగించి పట్టితివి చాలు రాయడిసేసి చన్నులు ముట్టకురా | ॥కూడు॥ |
పోకురా ఇఁకనెక్కడా పొంచి నన్నుఁ గూడితివి యీకురా పరకాంతల కిట్టి చనవు చేకూర నన్నేలితివి శ్రీవేంకటేశుఁడ నీకు రమణి నేనైతి నెయ్యమెల్లాఁ జూపరా | ॥కూడు॥ |