Display:
శృంగార సంకీర్తన
రేకు: 1682-3
సంపుటము: 26-488
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
నీవేల పంకించేవు నీకు నీకే
యీవలఁ బొడిమలు నీ కింకాఁ గట్టేరా
॥పల్లవి॥
కందువ నిప్పుడు వచ్చి కతలెల్లాఁ జెప్పేవు
అందరు నెఱఁగరా ఆ సుద్దులు
చెంది యాచారలెల్లాఁ జేసేవు నా ముందరను
నింద లెవ్వరైనా నీ మీఁద నాడేరా
॥నీవే॥
నలిరేఁగి యందరిలో నవ్వులెల్లా నవ్వేవు
చెలులకుఁ గొత్తలా నీచేఁతలెల్లాను
చలువలు వుట్టఁ గడు చదువులే చదివేవు
నిలువున నిన్ను నిఁక నేరము లెంచేరా
॥నీవే॥
యీడనే కాఁగిట నించి యింతతో నన్నుఁగూడేవు
వాడవా రెరఁగవా నీ వలపెల్లాను
పాడిపంతాలు చెప్పేవు పక్కన శ్రీవేంకటేశ
యేడనైనాఁ గల్లతనా లెంచేరా నీమీఁదను
॥నీవే॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము