Display:
శృంగార సంకీర్తన
రేకు: 1682-4
సంపుటము: 26-489
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
ఆలి మగనికి నౌఁగాము లేడవి
మేలుగలిగితే మెచ్చుట గాక
॥పల్లవి॥
జంకించనేఁటికి సారెకు నే నీ-
వంకలాడి కడు వలచితిని
మంకు గొల్లెతలు మందనుండి రాగా
కొంకక కూడితేఁ గూడితిగాక
॥ఆలి॥
అలుగనేఁటికి యప్పుడే నే నీ-
పలుకులకే భ్రమసితి
బలువ నీతల పదారువేపుర
కలిమి గైకొంటేఁ గైకొంటిగాక
॥ఆలి॥
సోదించనేఁటికి చొక్కి నిన్నుఁ గూడి
సాదించి నీమోవి చవిగొంటి
యీదెస శ్రీవేంకటేశ నీ వెవ్వరి
బోదించి పొందినాఁ బొందుదుగాక
॥ఆలి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము