శృంగార సంకీర్తన
రేకు: 1688-3
సంపుటము: 26-524
రేకు: 1688-3
సంపుటము: 26-524
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
ఆయనాయ నీజాడల కడ్డాలాడేనా రాయడించ కిఁకఁ గాతరాలేల యియ్యెడల | ॥పల్లవి॥ |
కలికితనాల లేనికత గడియించనేల కలసినదాఁకా నెక్కడిసటలే లలి నింత చాలదా నీ లాగరిచేఁతెల్లాఁ గంటి కల కల నగక ఇక్కడికి రారాదా | ॥ఆయ॥ |
జగడా లదేలే నీ చక్కఁదనాలఁ జాటక యెగ సక్కేలింతటనే హెచ్చె ననేరా అగడాయఁ గటకటా ఆడానీడా నీ యాస తెగనాడఁజెల్ల దిఁక తెరదియ్యరాదా | ॥ఆయ॥ |
సరసాన సారెసారె చల్లనికాఁకలె గరగరఁగా తరగరి తనాలా ఆరసి శ్రీవేంకటేశ అట్టె నన్నేలితివి కరకరి యేల చక్కటి నంటరాదా | ॥ఆయ॥ |