Display:
శృంగార సంకీర్తన
రేకు: 1724-6
సంపుటము: 27-144
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాదరామక్రియ
ఒడివట్టి తియ్యకు నే నోప నందుకు
చిడుముడిఁ బెనఁగేవా చిన్నదాన నేను
॥పల్లవి॥
నీకు మోహించితి నేను నీ వప్పటి నెవ్వతెకు
యేకడ మోహింతువో యెవ్వఁ డెఱుఁగు
ఆకెను నన్నొకటి కమ్మనుచుఁ గూడఁగట్టేవు
మాకేల నీకేకాక మానినుల గొడవ
॥ఒడి॥
నీతో నవ్వితి నేను నీ వప్పటి నెవ్వతెతో
యేతులకు నవ్వుదువో యెవ్వఁడెఱుఁగు
చేతులువట్టించే వాపెచేతను నే నిక్కఁగాను
నీతితో నీవే బతుకు నేరము నేమంతేసి
॥ఒడి॥
నిన్ను నేఁ గూడితి నిదె నీ వప్పటి నెవ్వతెను
యెన్నికతోఁ గూడుదువో యెవ్వఁడెఱుఁగు
యిన్నిటా శ్రీ వేంకటేశ యిద్దర మొక్కటైతిమి
మన్నించవయ్యా మమ్ము మతకాలెఱఁగము
॥ఒడి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము