Display:
శృంగార సంకీర్తన
రేకు: 1725-1
సంపుటము: 27-145
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
నేరుతువు కరియమాణిక్కె దేవుఁడా
నీ రపము కరియమాణిక్కె దేవుఁడా
॥పల్లవి॥
మక్కువ నాతోఁ బెనఁగి మంచానకుఁ దీసేవు
నిక్కమా కరియమాణిక్కె దేవుఁడా
అక్కరతో బత్తి సేసి ఆయము లంటేవు నాకు
నిక్కలాయఁ గరియమాణిక్కె దేవుఁడా
॥నేరు॥
చేవదేర నీవు నన్నుఁ జేయివట్టి పెనఁగఁగా
నీవి జారెఁ గరియమాణిక్కె దేవుఁడా
కైవశమై పాయలేను కప్పురవిడేలకే
నీవద్దనే కరియమాణిక్కె దేవుఁడా
॥నేరు॥
అచ్చపు గురుతులెల్లాఁ ఆనతిచ్చి రప్పించితి
నెచ్చెలిచేఁ గరియమాణిక్కె దేవుఁడా
ఇచ్చగించి శ్రీ వేంకటేశుఁడవై కూడితివి
నిచ్చలునుఁ గరియమాణిక్కె దేవుఁడా
॥నేరు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము