శృంగార సంకీర్తన
రేకు: 1725-2
సంపుటము: 27-146
రేకు: 1725-2
సంపుటము: 27-146
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మధ్యమావతి
ఎగ్గుపట్టేవు గనక యెరవా నాకు సిగ్గు విడిపించే నింతే చెల్లదా నాకు | ॥పల్లవి॥ |
చెన్నుమీర నిన్ను సాము సేఇంచేకొరకుఁగాక చన్నుల నొత్తక నీతో చలమా నాకు తిన్నని నీగుణ మిట్టె దిద్దుకొనే మింతే కాక పన్ని నిన్ను జంకించఁ బంతమా నాకు | ॥ఎగ్గు॥ |
దక్కిన పెండ్లినాటి తగవు నేరిపేఁగాక గక్కనఁ గాలు దాఁకించ గర్వమా నాకు లక్కవలె గరఁగించి లావులు నెరపేఁగాక పెక్కుమారులు వెనఁగ బిగువా నాకు | ॥ఎగ్గు॥ |
యెంగిలి పొత్తు గలసి యెనసే కొరకుఁగాక సంగతిగా మోవియ్య రాజసమా నాకు కుంగక శ్రీ వేంకటేశ కూడితి మేలుకే కాక అంగమెల్లా నలయించ నంతపగా నాకు | ॥ఎగ్గు॥ |