శృంగార సంకీర్తన
రేకు: 1730-5
సంపుటము: 27-179
రేకు: 1730-5
సంపుటము: 27-179
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
కానీవయ్యా అందుకేమి కాదనేనా మోనాన నుండఁగ నిన్ను మోవనాడేనా | ॥పల్లవి॥ |
పొత్తుల మాఁటలలోనే బువ్వమారగించితిరి అత్తి మోవులనే విడే లందుకొంటిరి యెత్తిన చలముతోడ యేల నాతో బొంకేవు కొత్తలుగ వేరే నిన్నుఁ గోపగించేనా | ॥కానీ॥ |
తెలినవ్వు సిగ్గులనే తెరలు వట్టించితివి తలఁబాలు వోసితివి తమకముల చలము సాదించి యేల సారె నానలు వెట్టేవు వెలినుండి వేరే నిన్ను వెంగెమాడేనా | ॥కానీ॥ |
గొప్పకుచముల బూజకుండలునుఁ బట్టితివి పిప్పిఁగాఁగ రతులను పెండ్లాడితివి ఇప్పుడే శ్రీ వేంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి నెప్పున నాపెకు నీకు నింద గట్టేనా | ॥కానీ॥ |