శృంగార సంకీర్తన
రేకు: 1767-4
సంపుటము: 27-401
రేకు: 1767-4
సంపుటము: 27-401
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
ఆసపడ్డపుడు రాక అలసినప్పుడు వచ్చి వేసరించేవు రతికి వేళలు గానీరా | ॥పల్లవి॥ |
చివ్వనఁ దియ్యకురా చేయివట్టి నీవు నన్ను పువ్వువంటిదాన నొప్పుల కోపను ఇవ్వల బానుపుపై నీ కెదురు చూచుకొంటా పవ్వళించి వుంటిని యే పరాకై వుంటివో | ॥ఆస॥ |
కప్పకురా పచ్చడము కాఁగిటిలో నీవు నాకు కప్పురము వంటిదాన కాఁక కోపను చెప్పరాని కోరికతో సిగ్గులెల్లాఁ బారవేసి అప్పటినుండియు నుంటి నాడనేల నుంటివో | ॥ఆస॥ |
మిగులాఁ బిసుకకురా మించి నా చన్నులు నీవు చిగురువంటి దానను చేఁత కోపను తగిలి శ్రీ వేంకటేశ దక్క నన్నుఁ గూడితివి అగపడి యుంటిని యేమనుచు నీవుంటివో | ॥ఆస॥ |