శృంగార సంకీర్తన
రేకు: 1767-5
సంపుటము: 27-402
రేకు: 1767-5
సంపుటము: 27-402
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
నీవే నేరుతు నేఁ జేసే??? వలపు పూవు వంటిది గుణము బుద్ది చెప్పు నాకును | ॥పల్లవి॥ |
పాడి మెప్పించేనంటే పలచన నాయెలుఁగు కూడి మెప్పించేనంటే కుచములు గట్లు ఆడి మెప్పించేనంటే అంగాలు నీచూపు లంటె యీడుదానఁ గాను నీకు నేమి సేతు నిఁకను | ॥నీవే॥ |
చెనకి మెప్పించేనంటే సిగ్గులే నానిలువెల్లా తనివి మెప్పించేనంటే తమకించీ వయసులు మనసిచ్చి మెప్పించితే మట్టుమీరె మోహము నిన్ను(ను) నమ్మివున్నదాన నేరుపుమీ చేఁతలు | ॥నీవే॥ |
చూపుల మెప్పించేనంటే సూదులకంటే వాండ్లు తీపుల మెప్పించేనంటే తేనె నా మోవి యేపున శ్రీ వేంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి యీ పనులకే మెచ్చితి యెంచకుమీ రతులు | ॥నీవే॥ |