శృంగార సంకీర్తన
రేకు: 1773-2
సంపుటము: 27-435
రేకు: 1773-2
సంపుటము: 27-435
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
ఆయఁ దొల్లె అన్నిపను లాపెకేమి ఆయా లెల్లాఁ జేకొనె నాపె కేమి | ॥పల్లవి॥ |
వీడె మిచ్చె నిన్నుఁ బట్టి వింతచేఁతలెల్లాఁ జేసె ఆడనుండే నవ్వు నవ్వె నాపె కేమి వాడుదేరఁజేసి నావద్దికి నిన్నంపి చూచీ ఆడికెకు వెఱవదు ఆపెకేమి | ॥ఆయఁ॥ |
చిప్పిల నెంగిలిసేసి చేరి నిన్ను నాకిచ్చె అప్పసము గాచుకొన్న దాపె కేమి వొప్పుగ నాయింటిలోనె వురమెక్కె తాను నీకు అప్పుడు నిప్పుడుఁదానె యాపె కేమి | ॥ఆయఁ॥ |
నేను తొలసిదేవిని నీపాదాలు పూజింపించి ఆనుక తా విఱ్ఱవీఁగీ నాపెకేమి తానె యలమేలుమంగ తగు శ్రీ వేంకటేశుఁడ ఐనతగవు నెరపె నాపె కేమి | ॥ఆయఁ॥ |