శృంగార సంకీర్తన
రేకు: 1773-6
సంపుటము: 27-439
రేకు: 1773-6
సంపుటము: 27-439
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
నెట్టుకొన్న మగఁడవు నీవే కదా యిట్టె నేఁ బదరఁగా యేమాయ నాకును | ॥పల్లవి॥ |
పంగించి నిన్ను బలిమిఁబట్టి పెనఁగఁగనేల సంగడివారితో పాటు చాలదా నాకు యింగిత మెఱిఁగి నేనిట్టె వుంటే మేలుగాక యెంగిలి సేసుకోఁగా యేమాయ నాకును | ॥నెట్టు॥ |
వాదడిచి నిన్నుఁ గడువంచుక తిరుగనేల సాదననిపించుకొంట చాలదా నాకు నీదయ గోరుకవుంటే నీవే మెచ్చేవు గాక యేదియని కొసరఁగా నేమాయ నాకును | ॥నెట్టు॥ |
సలిగె శ్రీవేంకటేశ సారె నీతోఁ జెప్పనేల అలమేలుమంగవార మౌట చాలదా వలపుతో నేనుంటే వచ్చి కూడితివి గాక యెలమి రట్టు సేయఁగా నేమాయ నాకును | ॥నెట్టు॥ |