శృంగార సంకీర్తన
రేకు: 1854-4
సంపుటము: 28-315
రేకు: 1854-4
సంపుటము: 28-315
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
ఇన్నిటాఁ దా నేరుపరి యిల్లాల నేను చిన్నదానఁ బ్రియమెంత చెప్పీనే తాను | ॥పల్లవి॥ |
వొడఁబరచినమాఁట లూఁకొంటిఁగదవే నడుమఁ దా నేమనినా నవ్వితిఁగదె అడియాలాలు చెప్పితే నౌఁగాదనఁగదవె తడవి నన్నేమిటికిఁ దగిలీనె తాను | ॥ఇన్ని॥ |
చలపట్టి వేఁడుకొంటే సమ్మతించితిఁగదవె సొలసితే తనమోము చూచితిఁగదె అలరి విడెమిచ్చితే నందుకొంటిఁ గదవె కొలఁది మీర నన్నెంత కొసరీనే తాను | ॥ఇన్ని॥ |
పాదములు చాఁచితేను పట్టి వొత్తితిఁ గదవే మోదమున మెచ్చితేను మొక్కితేఁగదే యీదెస శ్రీవేంకటేశఁ డింతలోనే నన్నుఁ గూడె పోదిసేసి నన్నేల పోదిగీనే తాను | ॥ఇన్ని॥ |