శృంగార సంకీర్తన
రేకు: 1854-5
సంపుటము: 28-316
రేకు: 1854-5
సంపుటము: 28-316
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాదరామక్రియ
సేసవెట్టి పెండ్లాడి సిగ్గులు వడితేఁ బోదు బాస యిచ్చి నీకితఁడు బత్తి సేసీని | ॥పల్లవి॥ |
మనసిచ్చి యాతనితో మాఁటలాడఁగదవే వినయాన ని న్నతఁడు వేఁడుకొనీని పెనఁగక ప్రియములే పెంచి పెంచి చూపవే మునుకొని చుట్టరికములే సేసీని | ॥సేస॥ |
వేడుకతో నీమోవి విందు లిట్టె పెట్టవే వోడక నీతోపొందు లొనరించీని జాడతోడ వీనులారా సమ్మతించి వినవే వాడికెతో మేనబావ వావులు చెప్పీని | ॥సేస॥ |
యింటలో నీబలమెల్లా నితనికిఁ జూపవే జంటయై నీకాఁ(కాఁగా?) టిలో సాముసేసీని నంటు శ్రీవేంకటేశుఁ డున్నతిఁ గూడె మెచ్చవే పెంటలైన రతులను పెచ్చు వెరిగీని | ॥సేస॥ |