శృంగార సంకీర్తన
రేకు: 1897-3
సంపుటము: 28-571
రేకు: 1897-3
సంపుటము: 28-571
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
ఇదివో ద్రిష్టాంతాలు యేచి??? చూడరే చెలులు యెదురెదురను మనయింటిలోనె వున్నవి | ॥పల్లవి॥ |
మాటలెల్లా మంచివే మనసు లెనసితేను చాటువకెక్కు పొందులు సమ్మతించితే వాటమౌనుఁ దమకము వలపులు మించితేను పాటించి కూరిమిగలపతికి సతికిని | ॥ఇది॥ |
చేసినవెల్లాఁ జేఁతలే చేరి చుట్టాలై యుండితే ఆసలు రేఁగు నెప్పడూ సండనుండితే బాసలెల్లా నీడేరు పాయని తగులైతేను సేసవెట్టి పెండ్లాడిన చెలికి మగనికి | ॥ఇది॥ |
భావించిన వెల్లా నౌను బత్తి కడుఁగలిగితే చేవదేరుఁ గోరికలు చెనకి తేను వావులొనఁగూడీ నిదేవరుసఁ బెండ్లాడఁగాను శ్రీవేంకటేశునకు శ్రీమహాదేవికి | ॥ఇది॥ |