శృంగార సంకీర్తన
రేకు: 1897-4
సంపుటము: 28-572
రేకు: 1897-4
సంపుటము: 28-572
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
తారుకాణ లిఁకనేలా తగులైన పనులకు నేరుతు వన్ని విద్యలా నెరజాణ వౌదువు | ॥పల్లవి॥ |
సొరిది నీమోవిమిఁది సూదివాటులే చెప్పీ గరిమల నీవు సేసే కాఁపురాలెల్లా కురులు చెదరినట్టి గురుతులే చెప్పీని సుతవిభముల చొప్పలెల్లాను | ॥తారు॥ |
చెక్కులమిఁదటి నీ చిరుఁ జెమటలే చెప్పీ గక్కన నీవు గడించే కలిమెల్లాను చక్కని నీమోము కళకే చాటిచాటి చెప్పీని మక్కువతో నీమనసుమర్మములెల్లాను | ॥తారు॥ |
మనుకొన్న నీ ముసిముసి నవ్వులే చెప్పీ పనివోని పొందులదాఁపురాలెల్లా య(యె?) నసిన శ్రీవేంకటేశ నీకాఁగిలే చెప్పీ జునగని నీనా సంది చుట్టరికా లెల్లును | ॥తారు॥ |