శృంగార సంకీర్తన
రేకు: 1900-5
సంపుటము: 28-591
రేకు: 1900-5
సంపుటము: 28-591
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
చిత్తమురాఁ దనసేవ సేసేఁగాక హత్తి నన్ను మోవి చవు లడుగఁగవలెనా | ॥పల్లవి॥ |
యెప్పడు దా నేమనినా నియ్యకొని నిచ్చేఁగాక తప్పలు వెదకేనా తనతో(లో?) నేను ముప్పిరి దనకు నేను మోహించివున్నదాన చొప్పలెత్తి నామనసు సోదించవలెనా | ॥చిత్త॥ |
గక్కనఁ జన్నులంటితే కానిమ్మని చొక్కెఁగాక తక్కరికై పెనఁగేనా తనతోనేను అక్కరఁ దనకు నేనాలనైతి నప్పడే ప్కన నన్నింత వొడఁ బరచఁగ వలెనా | ॥చిత్త॥ |
వొత్తి నన్నుఁ జెనకితే వొప్పుగొని వుండేఁగాక తత్తరించి కొసరేనా తనతో నేను యిత్తల శ్రీవేంకటేశుఁ డేలె నన్నుఁదగులైతి కొత్తలుగా నన్ను వేఁడుకొన నింత వలెనా | ॥చిత్త॥ |