సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 69 సంకీర్తన: 68
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 1
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 69 సంకీర్తన: 68
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 1
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పంతువరాళి
అంగనామణి కు - రంగలోచన భు - జంగ కచభారవే మంగళ మలమేలు - మంగవు మదన సం-గర సవ్యసాచివే | ॥పల్లవి॥ |
గబ్బి నీ ప్రాణేశు - డబ్బిన రతుల - నుబ్బీ ముంగురులు - గొబ్బున నొడిసీ నిబ్బరంబు నీ - గుబ్బల నురవు - దొబ్బీ యబ్బురముగా జొబ్బిల్లు కస్తూరి - గుబ్బలచెమట - గుబ్బెత లెల్ల - గుబ్బ లనగా మబ్బుతేలి కడు - శిబ్బితి వేళల - అబ్బలబ్బలని - అసురుసురైతివి | ॥అంగనా॥ |
మించి నీతో నెది - రించిన విభునీ - వంచీ కౌగిట బి - గించీ మోవప్ప ళించి తమ్ములము - నించి నీ గుణముల - నెంచి మంచి విరుల - ముంచిన శయ్యపై నుంచి యెద తా - టించి రవము గీ - లించి రాగె బి-గించి మర్మము కరి గించి చలము సా - ధించి మేలు పచ - రించితి వలమేలుమంగ వైతివి | ॥అంగనా॥ |
పంకజముఖి ని - శ్శంక నాయక గ - జాంకుశ యుత న - ఖాంక వర బిరు దాంకురాల వని - పొంక మొప్పగా - కంకణము గట్టి - అంకెల శ్రీరమణ వేంకటేశ్వరుని - బింకముతో పరి - యంకమున మక - రాంకుని కేళిని సుంకణగించితి - వింక నీ సాటి - (కొంకు లేనట్టివా) రింతు లున్నారా | ॥అంగనా॥ |