సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 192 సంకీర్తన: 199
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 29
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 192 సంకీర్తన: 199
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 29
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
ఆయెబోయె నింకనేటి - కమ్మలాల, వొక చాయ జేసుకోకుంటే - సతమాయె వలపు | ॥పల్లవి॥ |
అ(ల)సి యెదురుమాట - లాడ నేరనివాడు అలుగ నేరిచె నే - డమ్మలాల చలపట్టి వానినే - సాధించేనంటేను కలకాల మెవ్వరికైనా - కాణాచాయ వలపు | ॥ఆయెబోయె॥ |
తిట్టినాను కొట్టినాను - తెగి మోమెత్తనివాడు అట్టే పోయెనొక వీధి - నమ్మలాల కట్టుమట్టు చేసి వాని - కదలనియ్యనంటేను గట్టిగా నెన్నాళ్లకైనా - కాణాచాయ వలపు | ॥ఆయెబోయె॥ |
గారవించి పొత్తున గాని - భుజించనివాడు ఆరగించ జొచ్చే - నమ్మలాల నేరుపుతో వేంకట - నిలయుడు నన్ను గూడె కారణమింతె గాక - కాణాచాయ వలపు | ॥ఆయెబోయె॥ |