Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 92 సంకీర్తన: 91
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 30
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మాళవిగౌళ - అట
ఆహా శ్రీవేంక - టాద్రినాధురే
చోర వేంకటపతి జాణరే
ఆహాసిత కర్పూరభూతి జోగిరే
॥ఆహా॥
ధవళకర్పూరభూతి ధారాధరురే
భువనసంచిత కుక్షి - పొంకణ సుగుణురే
నవవాసుగంధయోగ - నాధురే
పవనాశనాద్రిపాల - పాలితురే
॥ఆహా॥
అహోమత్స్యేంద్రకూర్మ రజ-తాచల సింగినాధురే
గోబలనాథ సిద్ధయోగి
కంకణకింకిణి - శంఖలాంకృత
శంకర వినుతురె - వేంకటనాధురె
॥ఆహా॥
కాళీదేహాళీతాపత్రయజి
కేళీనయన వి - శాలయోగిరే
సంకుసింగినాధురే సిత క
ర్పూరభూతి యోగిరే
॥ఆహా॥
అలమేల్మంగసారంగ తురంగ
అంగాంగప్రియ కాళింగ మర్దనురే
॥ఆహా॥
మత్స్యేంద్రకూర్మ రజతాచల సిద్ధనాదం
గోపాలనాథ...సిద్ధయోగిం
భువనత్రయదేసి దూతికచ్చరారయోగిం
శ్రీశంభునవనాథ సిద్ధ యోగిం
॥ఆహా॥
సిరినాథు........
అభినవ కాళీతాండవాకారురే
ఆదినాథ పరమానందసింధురే
భూధారాధమరే భుజగశయనురే
దుగదుగదాందిగిదిగి ధింతద్ధిమి
ధిమికిట తంగిణి ధిమికిట తాండవకరురే
॥ఆహా॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము