సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 62 సంకీర్తన: 60
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 31
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 62 సంకీర్తన: 60
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 31
తాళ్లపాక చినతిరుమలాచార్య
రాగము: బౌళి - మఠ్య
ఇంకలేలే నీవు నాతో - నింత సేయను అంకెకాడ వౌదువు శే - షాద్రినాథా | ॥పల్లవి॥ |
చల్లలమ్మేవారికేలే - చందనము చెల్లు నీవే పూసుకోరా - చిన్నివాఁడా కల్లరివై నీవునాతో - గయ్యాళించవే మల్లాడ వీవదినెనా - మరదలనో | ॥ఇంకలేలే॥ |
జట్టిగా గొల్లెతలకేలే - చంద్రకావి గట్టిగాను నీవే దట్టి - గట్టుకోరా గట్టువాయితనమున - గవిసేవే నన్ను పట్టకురా చుట్టమునో - పక్కమునో (నేను) | ॥ఇంకలేలే॥ |
మందలో వారికేలే - మల్లెలు ముందుగా నీ కొప్పులోనే - ముడుచుకోరా అంది శ్రీవేంకటనాథ - అవురా మేలు అందముగాగూడితివి నీ - యాలనటరా | ॥ఇంకలేలే॥ |