సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 223 సంకీర్తన: 234
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 32
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 223 సంకీర్తన: 234
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 32
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంబోది
ఇంత తరితీపులేలే? - యేల గరిసించేవురా యింతి! వింతవాడ నటవే - యిట్లైతే సమ్మతించ(ను)రా | ॥పల్లవి॥ |
పయ్యెదలోని వేటివే - బంగారుకుండలురా తొయ్యలిరో వెలయేమే అం - దుకు వెలలే(దురా) | ॥ఇంత॥ |
మోవి మాట లవి యేమే - మొలకవెన్నెలలురా పూవుబోడి పైజల్లేవే - పూవిలుతుని యాజ్ఞరా | ॥ఇంత॥ |
(కావి)యెండ లవి యేమే - పూవు బొందు దండలురా(?) శ్రీవేంకటనాయకుడనె - చేరి సేవసేసేరా | ॥ఇంత॥ |