సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 181 సంకీర్తన: 187
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 33
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 181 సంకీర్తన: 187
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 33
తాళ్లపాక పెదతిరుమలాచార్య
రాగము: తోడి
ఇంత నేరకుండిన నదేఁటి యింతి వింత చెలుల నెరపు విడిపించే దింతి | ॥పల్లవి॥ |
తనిసిన మగవాని తమిరేఁచినదే యింతి కొనగోరిసోఁకు లియ్యకొనఁ జేసినదే యింతి కనుమూయించి నిద్దురకలలోఁ గూడిన దింతి తననేరుపు పిమ్మటఁ దలఁపించే దింతి | ॥ఇంత॥ |
కూడి తెల్లవారుటకు గుండె బెదరించే దింతి ఆడఁ జేయరాని వినయాలు సేయించే దింతి వాడుమోము తనుఁ గంటివడిఁ గళ రేఁచే దింతి జోడువాసినఁ గన్నీరు జొబ్బిలించే దింతి | ॥ఇంత॥ |
వన్నె ప్రాయము తనకే వ్రతము పట్టించే దింతి యెన్నికె నిక్కువనుండి యెదురు చూపించే దింతి యిన్నిటా శ్రీవేంకటేశు నిట్లానే చేసి కూడె నెన్నఁగ నలమేల్మంగ యీకెపో యింతి | ॥ఇంత॥ |
(ఈ సంకీర్తన 17వ సంపుటంలో 42వ సంకీర్తనగా ఉంది.)