సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 178 సంకీర్తన: 184
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 34
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 178 సంకీర్తన: 184
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 34
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాదనామక్రియ
ఇంత సేసితివి నీవే యిందాఁకాను యెఁ(యెం)తైనాఁ గద్దు చలము యేమిసేతురా | ॥పల్లవి॥ |
మంచిమాఁట లాడేనంటే మరి వెంగేలే తోఁచీ చుంచుల నిచ్చకములు సూటిపడవు లంచము మోవిచ్చేనంటే లావులఁ బెనఁగీ మోము యెంచరాదు నాపంతము యేమిసేతురా | ॥ఇంత॥ |
సేవలు సేసేనంటే చేతి కొనగోరు దాఁకీ వోవరిలో మనసులు వుడికించీని భావించి నవ్వేనంటే పగిడివెట్టినట్టయ్యీ యీవిధము నావుదుటు లేమిసేతురా | ॥ఇంత॥ |
మెచ్చి కాఁగిలించుకొంటే మేనిగురుతులు రాఁగీ కొచ్చికొచ్చి సిగ్గులెల్లా గుంపుగూడీని ఇచ్చట శ్రీవేంకటేశ యేలితి వింతలో నన్ను యెచ్చరించీ మర్మములు యేమిసేతురా | ॥ఇంత॥ |
(ఈ సంకీర్తన 23వ సంపుటంలో 115వ సంకీర్తనగా ఉంది.)