సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 82 సంకీర్తన: 82
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 35
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 82 సంకీర్తన: 82
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 35
తాళ్లపాక పెదతిరుమలాచార్య
రాగము: శంకరాభరణం
ఇట్టే నా సేవలును యిచ్చేటి నీ యీవులును గట్టిగా నే నల్పుఁడను ఘనుఁడవు నీవు | ॥పల్లవి॥ |
చిన్ననిమ్మపండే కాదా చేతికిచ్చి రాజులచే యెన్నరాని భూములకు నేలికయ్యేది పన్ని పేరుకొని యొకపద్యము చెప్పే కాదా సన్నల సర్వార్థములు బాగము కొనేది | ॥ఇట్టే॥ |
గవ్వవేసి తూఁచి కాదా ఘనమైన వజ్రము చివ్వనను విలువలు చేసుకొనేది అవ్వల జుట్టెఁడు తాఁటియాకువాసి వేసి కాదా యెవ్వరిచే ధనమైనా నిప్పించుకొనేది | ॥ఇట్టే॥ |
కసవుకట్టలు వేసి కాదా గోవులచేత కొసరుచుఁ బాలిప్పించుకొనియెడిది యెసఁగ శ్రీవేంకటేశ యిట్టే నేను మొక్కి కాదా పసగల నీ కృపకుఁ బాత్రుఁడ నైనది | ॥ఇట్టే॥ |
(ఈ సంకీర్తన 15వ సంపుటంలో 282వ సంకీర్తనగా ఉంది.)