సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 29 సంకీర్తన: 27
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 36
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 29 సంకీర్తన: 27
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 36
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లుప్తము
ఇది నమ్మరాదు మన - మెన్నటికిని పదిలము గాదిది - పాతకపు గొంప | ॥పల్లవి॥ |
యెనసి కట్టిన యిండు - లెమ్ముకలె వాసాలు పెనగొన్న నరములే - పెండెకట్లు ఘనమైన చర్మంబు - కప్పు యిందుకును మొనసి కట్టిన యంట్ల - మొత్తమీ కొంప | ॥ఇది॥ |
వాకిండ్లు తొమ్మిది - వరుసలో నిందుకును ఆకలియు దప్పులును - అను దినమును మూకలను గూడుకొని - ముచ్చులొక యైదుగురు చేకొని యుండేటి - చెరసాల కొంప | ॥ఇది॥ |
సారమా నేటి సం- సారమే సంకెళ్లు భారంపు కర్మాలు - పైకావలి కోరి శ్రీవేంకటేశుఁ- గొలువ నేరనివాఁడు యీ రీతినే వీడు - నీ మాయకొంప | ॥ఇది॥ |