సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 12 సంకీర్తన: 8
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 38
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 12 సంకీర్తన: 8
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 38
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గౌడిపంతు
(ఇరు కత్తులొక్క యొర - యింతి! యెట్లుండె? తరితీపులెట్లైన - దమి యొకటె గదరా! )[1] | ॥పల్లవి॥ |
(జుట్టు బాయని జోడు - జక్కవ పిట్టలు గుట్టుగా పడఁతి! యెద - గూడుండెనే తెట్టెలై సరసాంబు)[2] - ధిలో రెండు గుట్టలు తల దాచు - కొని యుండవేరా | ॥ఇరు॥ |
తలచ చేగకు బుట్టు - తరుణి! నీ కన్నులు యెలమి రెప్పల (నెట్టు - లిమి)[3] డుండెనే పలచగా కరసాన - బట్టిన క్రొవ్వాడి[4] యలుగులు దొన లందు - నణిగుండ వేరా | ॥ఇరు॥ |
చూడ వేడుకయైన[5] - సుదతి! నీ నుదు[6] రెట్టు యీడు కురులలోన - నిమిడుండెనే యీడైన దిరువేంక-టేశుండ![7] తొలు సందె కాడ చంద్రుని మబ్బు - గప్పియుండ దేరా! | ॥ఇరు॥ |
[1] (శిథిల పూరణము)
[2] (శిథిల పూరణము)
[3] యలమి రెప్పలలోనయిమి
[4] పలచగాఁట్టిన క్రొవ్వాండి కడసాన
[5] లైన
[6] నిదు
[7] వేంకటప్పడ (యతిభంగము)