Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 129 సంకీర్తన: 130
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 39
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మధ్యమావతి
(ఈ) జవ్వనం - బేలె బాలా, రవికోటి
తేజుడగు గోవింద - రాజు గలియని శ్రీల
॥పల్లవి॥
ములువాడి గోర జీ-రలు (దీర్చి చలపట్టి
పలుగాట్లు మోవి కెం-పులు గూర్చుకొను) దిట్ట
గళరేచి మిగుల తమ-కాన దనకు దాను
కళలెంచి కౌగిటను - గదియనేరని బాల
॥కీ జవ్వనం॥
పూని యారిట నీవి - పోదిగిచి యా వరుస
గా నాభిపై నురము - గండభాగములు జ
వ్వని(?) బట్టి మకరికలు - వ్రాసి చొక్కించు
వాని జొక్కగ జేసి - వన్నెకెక్కని (బాల)
॥కీ జవ్వనం॥
శ్రీవేంకటనిలయుడై - (సిరులిచ్చు) నీ తిల్ల
గోవిందుఁడేలెని ని - న్నే వగలు (పొరయక
భావించి సతిపతులు- పాటించి) మెచ్చ
భావజులన భూమి - ప్రౌఢి గాంచని బాల
॥కీ జవ్వనం॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము