Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 47 సంకీర్తన: 46
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 40
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
ఈ తప్పు జేసినందుకా - యింత జేసేది
మతకరివాని పొందు - మరి నమ్మ దగదు
॥పల్లవి॥
కలికి! నీ గుబ్బలపై - గందము బూసినందుకా
వులికి నన్ను జూసి - వొరసేది
యిలలో కఠినుల - కెంత సేవ చేసినా
మొన(ల?) జూపేది వారి గుణ - ముగదె చెలియ
॥ఈ తప్పు॥
ముదిత! నీ కెమ్మోవి - ముద్దు గొన్నందుకా
చెదరిన రాగముతొ - జిమ్మిరేగేది!
పదరి బత్తి సేసితే - పలుచనివాఁడు, తన
యెదలోనినొప్పిగా - నెంచగా దలఁచునా
॥ఈ తప్పు॥
కామిని నీ మేను బిగ్గె - కౌగిలించినందుకా
చేముంచి రతుల నన్ను - జెనకేది!
యీ మై శ్రీవేంకటప్పఁ - డెద నుంచినందుకా
వోమి నా చేత తన - వోజలు విడి(చేది)!
॥ఈ తప్పు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము