సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 43 సంకీర్తన: 42
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 41
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 43 సంకీర్తన: 42
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 41
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లుప్తము
ఈయవే నాకభయంబు - యింతిరో! నీవు నేను పాయము కాయము (గదిసి) - పదవిపై నుందామే | ॥పల్లవి॥ |
తమకపువాన గురిసెనే - తరుణీ! తాళగలేనే ప్రమదముతో నేనీ పయ్యెద - పంచ జేరియుండేనే కొమరుదేంట్లు తరమీనే - కోమలి వెరపయ్యీనే, నె య్యము మీరగ జోడుకూడి నీ - యండనె జేరుండేనే | ॥ఈయవే॥ |
వలపు వెల్లిబారీనే ఓ - వనితా యీదగలేనే కొలదిమీరు నీ చను - గొండలైన బ్రాకుండేనే చిలుకు చిగురు మరుడేసీనే ఓ - చెలియా తాళగలేనే కలికీ! నీకౌగిటి పాళ్యాననైన - కాపురముండేనే | ॥ఈయవే॥ |
వేడి వెన్నెల చీకట్లాయనే - వెలదీ దిగవిడువకువే చూడజూడ నీ చూపుల వెలుగున - సుఖమువాడనై వుండేనే నాడెల్లా నేలు శ్రీవేంకట - నాథుఁడ రమ్మని కూడితివి జోడువీడక మేడమీద - వేడుకతో గూడుందామే | ॥ఈయవే॥ |