సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 180 సంకీర్తన: 186
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 42
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 180 సంకీర్తన: 186
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 42
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాదనామక్రియ
ఈలాగు ప్రాణేశు - డెన్న డెడబాయడే యేలాగు వేగించు - నికను నేను | ॥పల్లవి॥ |
అలిగినపుడే విభుని - ఆలింగనము చేసి కలకలని నవ్వింతు - గానా నేను చె(చ)లిమి బలిమిని మోవి - చవి చూపి తమ్ములము కలయ వాతెర నుంతు - గా నేను | ॥ఈలాగు॥ |
పరిమళములు నిండ గు - బ్బల మీద నలదుకొని గరగరకెతో నుండు - గా నేను సరసతను సురతోప - చారమున విభు మనసు కరగించిపైకొందు - గా నేను | ॥ఈలాగు॥ |
చలముకొని విభు పచ్చ - డములో బవళించి కల సుద్దులేమందు - గా నేను అలమేలుమంగ (శ్రీ) వేంక - టాచలాధీశు కౌగిట కలికితనమున నుందు - గా నేను | ॥ఈలాగు॥ |