Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 129 సంకీర్తన: 131
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 43
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
ఉత్తమము చెప్పబోతే - ఒకటిపై నొకటవు, వాని
చిత్తము రంజిల్ల సేవ - జేయవే గొబ్బునను
॥పల్లవి॥
చేరెడు పంచదార వే - (సినదా చిలుకకు బుద్ధి సెప్పి
చేరదీసి మాటలెల్లా - జెప్పి యొప్పించేది)
సారెకు మొక్కిమొక్కి వే - సారితిమి యీ యలక
దీరదు నీ చేతగాని - దిద్దవే గొబ్బునను
॥ఉత్తమము॥
పుట్టెడు జవ్వాది - (పూసిగాదె పడతుల
నొట్టి రతుల కువ్వి - ళ్లూరించేది)
గుట్టుతోడ పాదాలు - బట్టుకొని వేసారితిమి
కట్టడిగాదు సమ్మతి - గా జేయవే గొబ్బునను
॥ఉత్తమము॥
యిచ్చవచ్చినట్లెల్లా - (మచ్చిక గల విభునితో
ముచ్చటలాడంగ నే - మో)పమమ్మ
గుచ్చి (యలమేల్మంగ - గూడితె శ్రీవేంకటేశ
హెచ్చు వేడుకలకుర - మెక్కవే గొబ్బునను
॥ఉత్తమము॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము