సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 163 సంకీర్తన: 167
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 47
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 163 సంకీర్తన: 167
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 47
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పంతువరాళి - పంచఘాత
ఎంతదొరవైన నీవు పెనంగక - నేనూరకుండుదునా వంతుకు వంతునే (సేసి - వదలక) మానను | ॥పల్లవి॥ |
చెంగావి పయ్యెదజార నా గుబ్బలు - చేత నీకు బిగబట్టవచ్చునట చెంగట నా కొనగోర నీ - చెక్కిలి జీరగరాదా రంగుగ నా మేని గంధమెల్ల నీకు - రాజిల్ల బెనగవచ్చునట యెంగిలంటా చౌకరించేవు నీ మోవి - యించుక నొక్కరాదా | ॥ఎంత॥ |
కురులవిరులు జారగా నాకిటు - గొప్పుననొడిసి పట్టవచ్చునట నెరజాణ ననుకొందువు నే - నీముంగురులైన బట్టరాదా తరితీపుల నీవు నన్నిట్టె - తమకించి యలయించవచ్చునట కరకరిజేసి నా కౌగిటిలో నిన్ను - కళలంటియుంచరాదా | ॥ఎంత॥ |
కడు తమకాన శయ్యపై నీవు నా - కట్టుకొంగెడవించవచ్చునట జడియక నేనిన్ను బట్టి యుపరతి - సలుపగరాదా బడలికదీర అలమేలుమంగ - పతినై కూడుండవచ్చునట తడబడక శ్రీవేంకటనాథ నే - దక్కితిననరాదా | ॥ఎంత॥ |