Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 44 సంకీర్తన: 43
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 108
తాళ్లపాక చినతిరుమలాచార్య
రాగము: లుప్తము
కొమ్మ నీ పలుకులకు - కుశలమస్తు
సమ్మదపు వయసు కై - శ్వర్యమస్తు
॥పల్లవి॥
బెడగు కళలను జాల - పెంపొందుచున్న నీ
యుడురాజు మోము క - భ్యుదయమస్తు
కడు నొప్పు నీరజపు - కళికల గేరు నీ
వెడద కుచములకు నభి - వృద్ధిరస్తు
॥కొమ్మ॥
జిగి మిగులగ తేనె - జిలుకు చున్నట్టి నీ
చిగురు మోవికిని ఫల - సిద్ధిరస్తు
సొగసు చక్రములతో - సొలయు నీ పిరుదులకు
అగణిత మనోరథా- వాప్తిరస్తు
॥కొమ్మ॥
తనరు తుమ్మెదగముల - తరుము నీ కురులకును
ననుపమం బైన దీ - ర్ఘాయురస్తు
నను ద్వారకాకృష్ణు - డనుచు గూడిన నీకు
ననుదినము నిత్య క - ల్యాణమస్తు
॥కొమ్మ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము