సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 264 సంకీర్తన: 279
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 119
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 264 సంకీర్తన: 279
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 119
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లుప్తము
చెలియ! నాపై యెంత - సేసేవు బత్తి, యిటు వలె ప్రియుని లాలించు - వనిత వేరె కలదా | ॥పల్లవి॥ |
తలకకిటు రొమ్ము మీ - దట గ(ల)క నిదుర క న్నులు మబ్బు దేరగా - బిలచినాను పలుకకుండగ మోవి - పంట నొక్కుచు మేలు కొలిపి తమ్ముల మిడిన - గలికివా నీవు? | ॥చెలియ!॥ |
చెయ్యార సాము సే - సిన మేను గాగా, బడలి వయ్యారి యింత క - ప్రం బిచ్చినాను ముయ్య కనుగవ మీద - మొన గుబ్బ చనుదోయి డయ్యించి యలపార్చు - తరుణివా నీవు? | ॥చెలియ!॥ |
చిలు(కు)రతిగతుల నల - సిన వేళ దాన మై నొలయు చమటలు సారె - (నుబ్బు) గాను చెలియ నలమేల్మంగ - శ్రీ వేంకటేశు నూ ర్పుల గాలి వడదీర్చు - పొలతివా నీవు? | ॥చెలియ!॥ |