Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 261 సంకీర్తన: 275
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 123
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లుప్తము
చేతు లలయ పూజ - సేతామురారో
పూతనాసంహారుని, నవ - నీత కృష్ణుని
॥పల్లవి॥
నాథుఁడితఁడె రుక్మిణీ - నాథుఁడితఁడె
రాధికా మనోహరుఁడైన వి - నోదుఁడితఁడె
॥చేతు॥
జారుఁడితఁడే నవనీత - చోరుఁ డితఁడె
మారుని గన్నట్టి నందకు - మారుఁ డితఁడె
॥చేతు॥
(మాధవుం) డితఁడె కంస - మర్దనుం డితఁడె
శ్రీధరుండైన వేంకట - నాథుఁ డితఁడె
॥చేతు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము