సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 254 సంకీర్తన: 267
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 124
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 254 సంకీర్తన: 267
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 124
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లుప్తము
చేవమావి - చిగురులివి చూడ, నీ తావికావి మోవి(యనీ) - (తలపౌనె) | ॥పల్లవి॥ |
బెళకెడు బేడిస - పిల్లలు చూడ, నీ తలచుట్టు కన్నులు - తలపౌనె (బలువు) గజనిమ్మ - పండ్లు చూడ, నీ తళుకు పాలిండ్లు - తలపౌనె | ॥చేవమావి॥ |
పనుపడు బంగారు - పలకలు చూడ, నీ తనరారు చెక్కులు - తలపౌనె గొనబడు సింగంపు - కొదమను చూడ, నీ తనువగు లేగౌను - తలపౌనె | ॥చేవమావి॥ |
రమణ తుమ్మెద మొగ్గ - రపు కప్పు చూడ, నీ తమి మెచ్చు బలుగొప్పు - దలపౌనె కమలము చూడ వేం - కటపతౌ తనకు నీ తమిరేచు నెమ్మోము - తలపౌనె | ॥చేవమావి॥ |