Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 151 సంకీర్తన: 153
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 141
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లుప్తము
తేనెను (తేగా) బోవలె - తెరువియ్యరా
ఆనలు బెట్టకురా! మా - యమ్మ వినీనీ
॥పల్లవి॥
చెట్టబట్టకురా - చెప్పిన ట్టుండరా
చెట్టు కొక రున్నారు - చెంచెతలు
పట్టపగలురా! - భయము లే దటరా?
వట్టి (నేటికి) రా! మా - వదిన వినీనీ
॥తెలిసి॥
మెల్లనె మాటా(డ)రా - మెడ చెయ్యి దియ్యరా
(కుల్లు) చెంచెతలురా - కొల్లలు కొల్లలు
చల్లుబో(?)రాడకురా - సతులు కనేరా
అల్ల వాడుగో రా మా - యన్న వినీనీ
॥తెలిసి॥
కురులు దువ్వకురా - గుబ్బ లంటకురా, యే
మఱగు నైనా వచ్చి - మన్నించే గానీ
తిరువేంకటాద్రి - దేవుడవై కూడితివి
మరలి చెంచెతనై నీ - మగువ నైతి గానీ
॥తెలిసి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము