సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 147 సంకీర్తన: 149
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 146
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 147 సంకీర్తన: 149
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 146
తాళ్లపాక పెదతిరుమలాచార్య
రాగము: లుప్తము
దేవ [1]నావలన గుణము తెలిసి కాచే ననేటి యీ వెఱ్ఱితనము మాని యిట్టే నన్నుఁగావవే | ॥పల్లవి॥ |
నేరుపే నాకుఁ [2]గలిగితే నెట్టన నింద్రియముల బారిఁబడి బంటనై పంపుసేతునా ఆరీతి నేనే వివేకి నైతే హేయపుమేను కోరి బ్రహ్మమని నమ్మి కొంకక గర్వింతునా | ॥దేవ॥ |
నాలో బుద్ధి గలిగితే నలిఁ గామక్రోధములు యీ లీల నాసొమ్ము లని యెన్నుకొందునా తాలిమి నాయందు మంచితనములు గలిగితే మూలనున్న నా కర్మములే కట్టివేసునా | ॥దేవ॥ |
చిత్తమే కైవసమైతే చేరి సుఖదుఃఖముల మత్తుఁడనై మఱచి యేమరివుందునా అత్తిన శ్రీవేంకటేశ అంతర్యామిని నీవు తత్తరపు నా పస నీ [3]వెఱుఁగవా | ॥దేవ॥ |
(ఈ సంకీర్తన 15వ సంపుటంలో 12వ సంకీర్తనగా ఉంది.)
[1] నావల్న
[2] గటీతే
[3] నీవెరంగవా