Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 201 సంకీర్తన: 210
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 147
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లుప్తము
దేవరకే చెల్లెనో - దేవరాజ, నీవు
దేవర వైతివి గదా - దేవరాజ
॥పల్లవి॥
తిరుమణి సొగసాయ - దేవరాజ
తెరగెన్నడు గానము - దేవరాజ
తెరవనేల యేచేవు - దేవరాజ, అది
(తిరుమాన)మెన్నడు - దేవరాజ
॥దేవరకే॥
తీరాయ చెక్కిటి గోరు - దేవరాజ
తీరెక్కడలేదు - దేవరాజ
తేరని సొమ్మాపెకిచ్చిది - దేవరాజ, అది
తేరకగాక సతము - దేవరాజ
॥దేవరకే॥
తెరవనంపైన దేవు - దేవరాజ, యీ
(తరుణికిదే) తలపాయ - దేవరాజ
తిరువేంకటకాంతుడా - దేవరాజ, స్వామి
తిరుగా పెరుందేవి గూడితివి - దేవరాజ
॥దేవరకే॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము