Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 38 సంకీర్తన: 37
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 165
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లుప్తము
నీలశైలము వంటి - నెమ్మేని కాంతులకు నిజమైన (నెల)వాయె - నుయ్యాలా॥పల్లవి॥
పాలిండ్లు కదలగా - పయ్యదలు జారగా - భామినులు వడి నూతు రుయ్యాలా
ఓలి బ్రహ్మాండమ్ము - లొరుగునో యను (భీతి) - నొయ్య నొయ్యన నూతు రుయ్యాలా
॥నీల॥
కమలకును భూసతికి కదలు కదలున (డాసి) - కౌగిలింపగజేసె నుయ్యాలా
అమరాంగనలు (చూపు) - హావభావములెల్ల - నమరంగ జేసె నీ యుయ్యాలా
॥నీల॥
కమలాసనాదులకు - కన్నుల పండువై - కడు వేడుకాయ నీ యుయ్యాలా
కమనీయ మూర్తి వేం - కటశైలపతి నీకు - గడు (చేరువాయె నీ) యుయ్యాలా
॥నీల॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము