సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 113 సంకీర్తన: 113
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 176
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 113 సంకీర్తన: 113
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 176
తాళ్లపాక పెదతిరుమలాచార్య
రాగము: లుప్తము
నేనైతే నీడేరుదు నీకు లీలా మాత్ర మింతే మానక నన్నేలు కొమ్మి మాధవ గోవిందా | ॥పల్లవి॥ |
నీవు నన్ను మన్నించితే నీ మహిమలోఁ గొంత యీవల వెలితి యౌనా యీ లోభ మేలా కావించి పాలజలధికడ నొక్క తుంపురు వేవేగ విదలించితే వెలితి యెందులకు | ॥నేనైతే॥ |
వెడకర్మినైనా నన్ను వెనక వేసుకొంటేను గొడవ నీకు వచ్చీనా కొంక నేఁటికి గడుసుదొంగైనవాఁడొకఁడు కొండలో దాఁగితే యెడ మిచ్చినకొండకు హీన మయ్యీనా | ॥నేనైతే॥ |
కందువ శ్రీవేంకటేశ కరుణారసము నాపై చిందరాదా అనుమాన చింత లేఁటికి యిందరిపై సూర్యుఁడు యెండలు గాసితేను అందుకొన్ని కిరణాలు అరగిపోయీనా | ॥నేనైతే॥ |
(ఈ సంకీర్తన 15వ సంపుటంలో 22వ సంకీర్తనగా ఉంది.)