సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 111 సంకీర్తన: 111
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 182
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 111 సంకీర్తన: 111
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 182
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లుప్తము
పణతి(!) విరహపు మహో - త్పాతంబు వలన గణుతింప వలరాచ - కార్యమే మౌనొ (!) | ॥పల్లవి॥ |
సఖియ! కుచము లనేటి - జమిలి యంగములపై తెక తెకా నుడుకు (లె) - త్తిన గంధ మై పోయె (భౌమము) ముఖచంద్ర మండలము - మొనసి పరివేషమై యొక(ట) రెండు గ్రహా - లున్న వాలోన (అంతరిక్షము) | ॥పణతి॥ |
కలికి! నిట్టూర్పు(లను) పెను - గాలి విసరగ మేన ఝలు ఝల్లు (మంచును) - చమట వర్షము గురియ (అంతరిక్షము) నిల రేయి కనుబొమ(ల) - యింద్రధనువులు బొడిచె (అంతరిక్షము) కలహమున పగ(లె)చు - క్కలు రా(లె నాలోన) (దివ్యము) | ॥పణతి॥ |
యిభగమన! నడురాజ్య - మెల్ల కరువై పోయె నభము భువిసీమ పై - నను క(లియ) దాయె (భౌమము) విభుడైన శ్రీరమణి - వేంకటేశుని గూడె గుభులు గుభులన నురిమి - గురిసె నాలోన | ॥పణతి॥ |