సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 272 సంకీర్తన: 288
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 190
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 272 సంకీర్తన: 288
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 190
తాళ్లపాక చినతిరుమలాచార్య
రాగము: ఆహిరి - అట
పుట్టక తొల్లె యెన్ని నేర్చినావే - పువ్వుబోణిరో నీవు నెట్టన నీ పతి గారవించితే - నేలకు మింటికి సూత్రపట్టేవు | ॥పల్లవి॥ |
పూ(సి)న దే మంటే మృగము పేర - పొందిన పరి(మ)ళ మంటివి వా(సి)గ నీ పేరేమనంటే, దశవదనుని - వైరినే నంటివి మీ(సీ)మ యేదంటే రెండు మాకులపేర - మెరసిన పట్టణ మంటివి వో(సె)మ్మ! నే జెల్ల, నీవు నీ వుపమలు! - (వోపినంత చూడమంటివి) | ॥పుట్టక॥ |
కమ్ము(క) నీ మేన నున్న దేమనంటే - గగనము పేరిటి దంటివి (కొమ్మరో! యాపైనున్న వేమంటే - కొండలే కను మంటివి) రొమ్ము మీద చిలికించిన దే మనంటే - (ఋ)తువు (పేరంటివి) (చిమ్మనగ్రో వదేల నంటే - చిమ్మి రేగ మంటివి) | ॥పుట్టక॥ |