Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 233 సంకీర్తన: 244
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 195
తాళ్లపాక చినతిరుమలాచార్య
రాగము: శంకరాభరణం
పొద్దుబోదా నీకు నేమి - పురుషోత్తమా, మేలు
సిద్దవిద్య లాడేవు - శ్రీపురుషోత్తమా!
॥పల్లవి॥
పట్టిపట్టి యాడేవు పడతుల కుచములు - పుట్టచెండా నీకు పురుషోత్తమా!
దొట్టిన వేడుక రొమ్ము దొక్కి యిందరుండగాను - చిట్టకములు మానవైతి శ్రీపురుషోత్తమా!
॥పొద్దు॥
లలనకెమ్మోవులకు గుక్కిళ్లు మింగేవు - పులకండమా నీకు పురుషోత్తమా
వెలలేని భూకాంత వీపెక్కి వున్న - దెవ్వరి చెలి మీద చేయి చాచేవు శ్రీపురుషోత్తమా!
॥పొద్దు॥
కావరించి యింతుల పులకల తావులు గొనేవు - పూవు దండలా నీకు పురుషోత్తమా!
చేవ నన్ను గూడితివి శ్రీవేంకటనాథుడవై - శ్రీవధూటినా నీకు పురుషోత్తమా
॥పొద్దు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము