సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 155 సంకీర్తన: 158
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 196
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 155 సంకీర్తన: 158
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 196
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
పొద్దువోకలివి నీకు భువిలో నెన్నఁగ నీ సుద్దులు చెప్పెదమన్న చూడఁజూడఁ గొత్తలు | ॥పల్లవి॥ |
మోఁతనీటిలోని యీఁత మూఁపునఁ బుట్టిన[1] మేఁత మూఁతిమీఁది కత్తికోఁత మొనగోరివాఁత[2] బాఁతిలేని దారవోఁత పాపముచూడనిచేఁత నాఁతిమీఁది తలపోఁత నాఁగేటిగీఁత | ॥పొద్దు॥ |
వలపు చల్లినలాగు వాజినెక్కినబాగు వలసి నొల్లములైన వలవనిజాగు తెలిసితిమిదెనేఁడు తిరువేంకటేశ్వర తలఁపు ప్రాణులమీఁదఁ దగులుటేలాగు[3] | ॥పొద్దు॥ |
(ఈ సంకీర్తన 5వ సంపుటంలో 275వ సంకీర్తనగా ఉంది.)
[1] నిడురేకు 88: బెట్టిన, తా. వేం. 155: మోఁత
[2] నిడురేకు: వ్రాఁత
[3] దగిలేటి లాగు