Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 211 సంకీర్తన: 221
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 199
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లుప్తము
పొసగంగా చెలినడు(మది) - పోలగనెటులుండె
నెసగ నాకాశమ్మే - యిల తెగిపడినట్లుండె
॥పల్లవి॥
అరయగ నీ కమ - లాననకు నయనము
లొరసి యెన్నికకు నెటు - లుండె (దిలకింప)
ధరపై చంద్రో - దయమునకై కలువలు
చిరతరమ్ముగ వేచి - వికసించినటులుండె
॥పొసగంగా॥
అల(లి)వేణి వలిపె ప - య్యదలోని కుచములు
మలగిన చెలి చెలిమి - చెలువ మెటులుండె
సలిలతములైనట్టి - జక్కవ పులుగులు
చెలగి సన్నని వలను - జిక్కినటులుండె
॥పొసగంగా॥
(అరయ) నలమేల్మంగ వేంక - టాధీశుకౌగిట
నరిగాపు సేయగా - నది యెట్టులుండె
నెరయంగ గప్పిన - నీలమేఘము పొంత
(మెరసి మినుకను) తీగ - మెఱపువలె నుండె
॥పొసగంగా॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము