సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 248 సంకీర్తన: 259
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 201
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 248 సంకీర్తన: 259
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 201
తాళ్లపాక పెదతిరుమలాచార్య
రాగము: సౌరాష్ట్ర
పోయే[1] నన్న - పోనీఁడమ్మ పాయక నన్ను కొంగు - పట్టీ వీఁడు | ॥పల్లవి॥ |
యెదురైతే మొక్కీ వీఁ - డెవఁడమ్మ అదనెరఁగఁడు - యౌనే వీఁడు | ॥పోయే॥ |
మగనాల[2] నన్న - మానఁడమ్మ నగీ నేడ[3]నైనా - నాతో వీఁడు | ॥పోయే॥ |
యింతలో శ్రీవేంక - టేఁశుఁడమ్మ వింతసేసి కూడె - (వేమారు)[4] వీఁ డు | ॥పోయే॥ |
[1] పొయ్యే
[2] మొగనాల
[3] నెడ
[4] నెమో